పుట:Dvipada-basavapuraanamu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

255

చిత్రంబుగా నప్డ శివలోకమువకుఁ 800
గొనిపోయెఁ ; గటకంబుజనులెల్ల బెదరి
కనుకనిఁ బఱవంగఁ గ్రందు పుట్టుటయుఁ
గన్నభక్తులు వార్తవిన్నభక్తులును
నున్నభక్తులుఁ బోయి రొక్కొక్క యెడకు ;
నంత రాజ్యార్థమై యనిచేసి యతని
సంతాన మెల్ల నిస్సంతాన మయ్యె :
వీఁకఁ గొట్టములలో వెలిఁగె గుఱ్ఱములు
తోఁకల నిప్పులు దొరుగ నాక్షణమ ;
కరులును గరులును గన్నంత నెదిరి
పొరిఁబొరిఁ దాఁకి జర్జరితమై పడియె ; 810
బ్రమసి యమాత్యాది భటవర్గ మెల్లఁ
దమలోనఁ జర్చిరి సమరంబు సేసి ;
బసవని సత్యశాపమునఁగాఁజేపి
పసచెడి కటకంబు వాడయ్యె నంత;
వినియె నంతయు నట సనియెఁ గూడలికిఁ
గనియె సద్గురువు నగయదేవు నచట :
భక్తులుఁ దానును బరమానురాగ
యుక్తి నబ్బసవయ్య యుండె సంప్రీతి ;
నంత నాగురువు సమంచితనాద
సంతతపూజాది సత్క్రియావలుల 820
ముంచి భజించి కీర్తించి మెప్పించి
మించి విన్నప మాచరించి ప్రార్థించి.
"దేవ ! సద్గురుమూర్తి ! దివ్యలింగాంగ !
దేవ నాసంగయ్య , దేవ ప్రాణేశ !
నీదుసద్భక్తప్రసాదంబుఁ గుడిచి
యాదట బ్రదికి యింతై తిఁ గావునను
భవభవంబుల వారి పన్నఁగాఁ దగుదు
భువివారి ఋణమునఁ బోవుట గలదు ;