పుట:Dvipada-basavapuraanamu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

బసవపురాణము

దారును నాప్రసాదం బారగించి
యారాత్రి కొల్వున కరిగి, బిజ్జులుని
నల్లంతఁ బొడగని, యలుఁగులు వెఱికి
జల్లున నలిగి యాసభ దల్లడిల్ల
నొక్కట మువ్వురు సుద్వృత్తి నెగసి
చక్కడ్చి, పొడ్చి, జర్జరితంబు సేసి,
యలుకమై గెడిగెడీ యనుచు బిజ్జలుని
తల గోసి పొట్టలోపలఁ బెట్టి కట్టి,
'తా నసంఖ్యాతుల యానతి యదియు
నీనరాధముఁ బొలియించితి మేము ; 780
అధికులౌ భక్తుల కహితంబు సేయు
నధము లందఱును నివ్విధిఁ బోదు' రనుచుఁ
గాయముల్ బిగియుచు గతులు ద్రొక్కుచును
ఠాయము ల్గొనుచు దండల నటింపుచును
బొంగి బొబ్బిడుచుఁ జెలంగి యార్చుచును
లింగభక్తుల కెదుర్లేరు వొం డనుచు
బిండుగాఁ బౌరులు 'బిజ్జలునితల
గుండుగండా' : యని ఘూర్ణిల్లుచుండ
మగిడి యామల్ల బ్రహ్మయగారుఁ దాను
నగరు వెల్వడి తన నగరికి వచ్చి 790
తల్లికి నందంద ధరఁ జాఁగి మ్రొక్కి
సల్లలితాంగి ప్రసాదంబు వడసి
“పరమపాతకు నట్టి భక్తిని గ్రహునిఁ
బొరిగొన్నయంతన పోవ దాద్రోహి
నప్పుడే చంపక యరుదెంచినట్టి
తప్పున కింకొండు దండ మున్నదియు'
ననుచు నజ్జగదేవుఁ డంతలోపలను
దనశిరంబున కల్గికొని విమానములఁ
బుత్త్రమిత్రకళత్ర గోత్రాదులను వి