పుట:Dvipada-basavapuraanamu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

253

యిచ్చునే కూర్చునే యిన్నియు నేల ?
క్రితము నీప్రాణ పరిత్యాగమునకు
మతిమెచ్చి యవసరోచిత మిచ్చి నిన్నుఁ
బంచి యేఁగిరి కాక భక్తు లాద్రోహిఁ
ద్రుంచుట కోడియే తొలఁగిరె చెప్పమ !
యందొక్కఁ డలిగిన నవికలాజాండ
సందోహములు గాలి డిందకయున్నె ?
దక్షుఁడు క్రొవ్వి యదక్షుఁ డై తొల్లి
దక్షమఖక్షయదక్షుఁ బల్కుటయు 750
వినఁగఁజాలక తాన తనకోపవహ్ని
గనలుట వినవె ? యాగౌరి దత్షణము :
యదిగాక యుపమన్యుఁ డభవునినింద
మది విన కపుడ భస్మం బయ్యెఁ గాదె ?
కావున శివభక్తగణనింద వినియు
నీ వూరకుండుట నీతియే ! వానిఁ
జంపకే కుడువఁగఁ జనుదెంచి తిపుడు
వంపుడుకళ్ళు నీ కింపారు నెట్లు ?
చీ! కుక్క ! చేఁజేత శివుప్రసాదంబు
చేకొని కుడువఁగ సిగ్గెట్టు లేదు ? 760
వచ్చి కద్కుదుగాక శ్వాసంబునట్లు
నుచ్చుచ్చురే"యని యొగిఁ జిట్ట మిడిచి
వెడలి వాకిటిదెస మృడుప్రసాదంబు
కుడుకతోఁ గొనివచ్చి పుడమిఁబోయుడును
'దగ వగు' ననుచును దాఁ గుక్కభాతి
జగదేవుఁ డిట్లు ప్రసాదంబు గుడువ
మల్ల బ్రహ్మయ లన మహి వీరభక్తి
కెల్ల యై వర్తిల్లు నెడ నర్ధరాత్రి
నీవార్త విని జగదేవునికడకు
వేవేగఁ జనుదెంచి వెండి వొత్తునను 770