పుట:Dvipada-basavapuraanamu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

237

మా దేవునిచేతఁ బ్రసాదంబు వడసి
యాదిఁ జండేశ్వరుఁ డట్ల మా కిచ్చె :
నంతటనుండి భోగింతు మిట్టులు ని
రంతరవంశపరంపర మేము;
నిప్పురి వీరమాహేశ్వరు లనఁగ
నిప్పు డేలా చెల్ల నిచ్చెద ? మనుచు
బసవయ్య యంత్రము ల్వన్నుటఁజేసి
పొసపరి మాతోడఁ బోరుచున్నారు ; 290
చెల్లింపఁదగు నని చెప్పు ! గాదేని
వల్లభ ! నీయింటి వాకిట నగ్ని
గుండముల్ ద్రవ్వించికొని కాల్దు" మనిన
నిండుఁగోపముతోడ నిఖిలేశ్వరుండు
బసవయ్య, దోఁడ్తేరఁ బనుచుడు బసవఁ
డసమానలీలమై నరుగుదెంచుడును
“గెడ గూడి బోయలఁ గెడపు టీదేమి ?
వడిఁ బ్రసాదము మీరు గుడుచు టిదేమి ?
యాదిమార్గమొ బల్మియో దీనిఁ జెపుమ !
కాదేని నాడికో కార్య మేమైన 300
నూరక కుడుచుట యుచితమే?" యనిన
ధారుణీశ్వరునితోఁ దా నిట్టు లనియె :
“నిచ్చుట గలదు సండేశున కభవుఁ
డిచ్చిన తెఱఁగు మీ రెఱుఁగరే ! వినుఁడు :
బాణలింగములందుఁ బటికంబులందుఁ
బ్రాణలింగములందుఁ బౌష్యరాగాది
లింగంబులందును లేదు ప్రసాద
మంగజహరునికి నాగమోక్తముగ;
ధరమానవులు మహేశ్వరుప్రసాదంబు
ధరి యించినను గొన్నఁ దారు సూచినను 310
నరయక దాఁటిన నరకాగ్ని శిఖల