పుట:Dvipada-basavapuraanamu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

235

నసమగజంబు నాగయ్య నెక్కించి
తానును బిఱుఁదెక్కి తననివాసమున
కానందలీల నొప్పారంగ నరిగె. 230
శివనాగుమయగారి ప్రవిమలచరిత
మవిరళప్రీతి దుల్కాడంగ వినినఁ
జదివిన వ్రాసిన సద్భక్తి మహిమ
లొదవు ; చతుర్వర్గపదములు సెందు.

—: బోయల తగవు :—


రుద్రునిమాఱట రూపంబు లనఁగ
భద్రేభసంహరు ప్రతినిధు లనఁగ
కళ్యాణమున నిత్యకళ్యాణభక్తి
లౌల్యనిరర్గళ లాలిత్యముగను *
శివభక్తిసంపదల్ సిలివిలివోవ
సవిశేషభక్తి దృష్టప్రత్యయములఁ 240
జూపుచు సద్భక్తి సురుచిరమహిమ
నేపారువీర మాహేశ్వరావలికి
భక్తమహత్త్వంబు భక్తాభివృద్ధి
భక్తచరిత్ర ప్రభావవై భవము
కన్నవారలు సెప్ప విన్నవారలును
నున్నతశివభక్తి యుక్తిమైఁ దగిలి
[1]దేవలకులు మంత్రదీక్షాన్వితులును
శైవపాశుపతాదిశాసనధరులు
వారివారిక లింగవంతు లై చూచి
వారివారిక లింగవంతు లై కూడి250
వీరమాహేశ్వరాచారనిరూడి
భూరిప్రసాదోపభోగు లై నడవ
బోయ లందఱుఁ గూడి భూమీశుకడకుఁ

  1. తంబళులు.