పుట:Dvipada-basavapuraanamu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

231

భక్తుని కిలఁ గోటిబ్రాహ్మణులైన
నెన యన్ననాలుక నేఁ గోసివైతు
ననచు ననంతపాలుని సభాస్థలిని
నెక్కొనఁగాఁ జండ్రనిప్పులు గాదె
చక్కన పొత్తి పచ్చడమున ముడిచెఁ ;
దా నేమి చెప్ప భక్తానీక మిండ్ల
శ్యానంబులకు ద్విజు ల్సరిరామి వినవె! *
నటుగాన కులహీను లన నెట్లువచ్చు
నిటలాక్షుభక్తుల నిఖిలేశ్వరుండ ! 120
కని ప్రతిష్ఠాపూర్వకం బైన పిదపఁ
జెనసి లింగమ కాక శిల యనఁ జనునె ?
యతిశయలింగదీక్షితుఁ డైనయట్టి
వ్రతి నంత్యజుం డని మతిఁ జూడనగునె ?
హరసన్నిహితుపూర్వ మరయుటయెల్ల
హరు శిలయన్నయ ట్లధికపాతకము :
మేదినీవల్లభ : మేరువు సోఁకి
కాదె తచ్ఛాయన కాకి వట్రిల్లు :
భృంగసంస్పర్శఁ బతంగంబుదొంటి
యంగంబునకుఁ బాయు టది దెల్ల గాదె : 130
వారిధిఁ దటినీప్రవాహముల్ గలయఁ
బేరున్న దే వేఱె ? పెక్కు లేమిటికి
సిద్ధరసస్పర్శఁ జేసి యౌఁగాదె
శుద్ధసువర్ణంబు శుద్ధతామ్రంబు !
గురుకరస్పర్శచేఁ గులమొక్కఁ డౌట
యరిదియే యట్ల యంత్యజుఁడు నగ్రజుఁడు?
ధర “నుమా మాతా పితా రుద్ర" యనఁగ
సరినొక్కదల్లి ప్రజలకు వేఱెద్ది ?
యొప్పెడుమాణిక్య మొక మసికోక
నెప్పాటఁ బొదివిన నిలఁ గాంతి సెడునె ? 140