పుట:Dvipada-basavapuraanamu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

223

గన్నుల ప్రోవిడెఁ గాళిదాసునకు ;
నాసక్తి శివనాగుమయ్యకుఁ గన్ను
లేసోమవారంబు నెడపక యీఁడె?
భానునిచేఁ బోని లోనికు ష్ఠడఁచి
పూని మయూరుని మే నిచ్చెఁగాదె ?
హరిచేతఁబోని దుర్భరమైన కుష్ఠు
హరియింపఁడే దండి యర్థిఁగీర్తింప ? 720
భువిజనులెల్లను బొగడుచు నుండఁ
దవనిధి దేడరదాసయ్య కీఁడె ?
ధూపవేళను ఘంటతోఁ గొనిపోఁడె
మేపార మెచ్చి యోహిళుఁ దనపురికిఁ ?
గరికాల చోడుకుఁ గనకవర్షంబు
నరులెల్ల నెఱుఁగంగఁ గురియించెఁ గాదె ?
మిగిలినబాసకు మెచ్చి ప్రాయంబు
మగుడఁక నీఁడె కుమ్మరగుండయకును ?
అక్కడఁ బ్రమథులు నక్కజం బంద
నెక్కిన గద్దియ యీఁడె చేరమకు ? 730
నిమ్మవ్వకై యేడ్డినమ్ములు సూఱ
యిమ్ములఁ బ్రమథలోకమ్మున విడఁడె ?
చెనసి జొమ్మయ్య చంపినమృగంబులను
ననయంబుఁ గైలాసమునకుఁ గొంపోఁడె ?
పూని యేడ్థినములపీనుఁగు బ్రదుకు
మానుగాఁ గదిరె రేమయ కిచ్చెఁగాదె ?
మలయరాజయ్య నిర్మల విమానమున
నలిగొన బొందితోనన కొనిపోఁడె ?
నిర్జితసంసారునిఁ గుమారపాల
ఘూర్జరుఁ దంత్రంబుఁ గొనిపోయెఁగాదె ? 740
లలి నూరివారిఁ బిళ్ల యనయనారు
వెలయఁగఁ దనలోనఁ గలపికొనండె ?