పుట:Dvipada-basavapuraanamu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

బసవపురాణము

బన్నుగాఁ గూర్ముండు భక్తిఁగొల్వండె ?
శ్రీరాముఁడును నట్ల సేతువు నిల్పి
శ్రీరామనాథు నర్చించుట వినమె ?
యాది క్షీరారామ మందు విష్ణుండు
గాదె రామేశ్వరుఁ గడు నర్థిఁ గొలిచె ?
ద్వారావతిని నిల్పి తాఁ గొల్చెఁ గాదె
కోరి గోవిందేశు గోవిందుఁ డర్థి ? 690
బ్రహ్మ యలంపూర భక్తితో నిల్పి
బ్రహ్మేశ్వరునిఁగాదె పాయక కొల్చె ?
నింద్రుండు పుష్పగిరీంద్రంబుమీద
నింద్రేశు నిడికాదె యెప్పుడుఁ గొలుచు ?
వారణాసిని నిల్పి వ్యాసుఁడు గాదె
కోరి వ్యా సేశ్వరుఁ గొల్చు సంతతము ?
ననయంబు వారణాసిని మునీంద్రులును
దనుజామరాదులు దమతమపేళ్ళ
నొక్కొక్క లింగంబు నక్కడ నిలిపి
యక్కజంబుగఁ గొల్చుటది దెల్లగాదె ? 700
యభవుఁ డక్షయుఁడు మహాదాని దక్క
నభిమతార్థము లిచ్చు సధిపు లున్నారె ?
యవ్విష్ణుఁ డా బ్రహ్మ యజ్ఞినముఖ్యు
లెవ్వరే నెవరికే నిచ్చిరే పదము ?
నరగరుడోరగవరమునీంద్రులకు
నీశ్వరుఁ డొసఁగినయీప్సితార్థముల
శాశ్వతలీల సజ్జనసాక్షికముగ
నిచ్చిన సకలలోకేశ్వరుమహిమఁ
గచ్చఱఁ బడిసినగణముల వినుము : 710
చేతులు రెండు సంప్రీతిఁ బూజింప
భాతిగాఁ జేతులు బాణున కిచ్చెఁ ;
గన్నులు రెండు సమున్నతిఁ బూన్పఁ