పుట:Dvipada-basavapuraanamu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

బసవపురాణము

లప్పురి మెఱసి యేకాంతరామయ్య
వచ్చి యప్పరు గుడివాఁకిట నిలిచి
“వచ్చెనా బాస శ్రవణులార !" యనుచు 170
నేకాంగనీరుఁ డలోకానుసారుఁ
డేకాంతరాముఁ డపాకృతకర్మి
చక్కన శిర మట్ట సంధింపఁ దడవ
నొక్కింత కొకదెస కోరవో యుండె;
‘హరుఁడు వేల్పగుట కేకాంతరామయ్య
శిరములోకులకెల్ల గుఱి ' యన్న యట్టు
లేకాంతరామయ్య శ్రీకరమహిమ
లోకాంత మయ్యెఁ ద్రిలోకంబులందుఁ ;
ప్రత్యక్ష మీతఁడే పరమేశుఁ డనుచు
నత్యద్భుతాక్రాంతు లై జను ల్వొగడఁ 180
“గడుదురాత్ములఁ జూడఁ గా దని తమకుఁ
బెడమొగం బిడె' నని భీతిల్లినట్లు
జనపాలకునిచేత జయపత్ర మిచ్చి
జినసమయులువచ్చి శివభక్త వితతి
ముందటి దెసఁ మ్రొక్కఁగఁబడిన
యందఱిమొగములయం దచ్చులొత్తి
యారిచి పెడబొబ్బ లందంద యిడుచు
వీరమాహేశ్వరవితతి యుప్పొంగి
వెనుకొని వసదుల విఱుగఁ గొట్టుచును
జినప్రతిమలతల ల్చిదిమివై చుచును 190
నసమానలీలఁ గల్యాణంబునందు
వసదియు జినుఁ డనువార్త లేకుండఁ
గసిమసంగుచుఁ జంపి గాసివెట్టుచును
వసుధలో జిను లనువారి నందరను
నేలపాలుగఁ జేసి నిఖిలంబు నెఱుఁగఁ
గాలకంధరుభక్తగణసమూహంబు