పుట:Dvipada-basavapuraanamu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

201

మొలవఁగ లోలోన నలిఁ దోఁచుశిరము
తఱిగెడు శిరముమ దఱుగని శిరము
తఱుగక తనుదాన యొఱఁగెడు శిరము
సరసర హరుమీఁద సంధిల్లుశిరముఁ
బొరి నొయ్యనొయ్యన పొడవగుశిరము
కన్నులార్చుశిరముఁ గాదనుశిరము
మిన్నక శివుమ్రోల మెలఁగెడిశిరము
నున్నతి మీఁదన యుండెడుశిరము
సన్న సేయుశిరము జరిగెడుశిరము 90
నారుచుశిరము నౌనౌ ననుశిరముఁ
గేరెడుశిరమును దారెడుశిరముఁ
బారుతెంచుశిరంబుఁ బైపడుశిరము
గారవంబున శివుఁ గలసెడిశిరము
ననలంబుమీఁదను నలరెడుశిరము
ననలంబు మ్రింగుచు నట యుండుశిరము
బొబ్బిడుశిరమును నుబ్బెడుశిరము
గుబ్బనఁబడి తద్ద గునిసెడుశిరము
నాలుక ల్గ్రోయుచు నలి గొనుశిరము
శూలిని వెక్కిరించుచు నుండుశిరము 100
నుఱికుర్కిపడుశిర మొఱగెడుశిరము
మఱియు సంధిల్లుచు మఱుపడుశిరము
పొగడెడుశిరమును నగియెడుశిరముఁ
దెగడెడుశిరమును దీవించుశిరము
శర ణనుశిరమును జయవెట్టుశిరము
సరసమాడుశిరముఁ జదివెడుశిరము
మలరెడుశిరమును మార్కొనుశిరము
దలఁక కీశ్వరుతోడఁ దాఁకెడుశిరము
'బా' పనుశిరమును బాడెడుశిరముఁ
'జాపంద' యని శివు జంకించుశిరము 110