పుట:Dvipada-basavapuraanamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

బసవపురాణము

యతుల కోపోద్రిక్తుఁడై కసిమసఁగి
కృతకులఁ దునుమంగ మతిఁ దలంచుడును
బరవాదు లలి భయభ్రాంతాత్ము లగుచు
నరుదెంచి యంతంత ధరఁ జాఁగి మ్రొక్కి
“యసమాన ముసిఁడిచౌడాచార్యవర్య !
దెసయును దిక్కును దేవ ! యేడ్గడయు
నీవ ; మా కన్యధాభావంబు లేదు :
కావవే ! యజ్ఞానజీవుల శఠుల
సకలాపరాధుల సైరించి మమ్ము ;
సుకృతవంతులఁ జేయు సుజనాగ్రగణ్య !" 980
యని విన్నవించుచు నభయంబు వేఁడ
ఘనకృపామతి నార్తజనశరణ్యుండు
సజ్జన శ్రేష్ఠుండు సౌడరాయండు
నజ్జనానీక మత్యర్థిఁ గీర్తింప
గతపూర్వలాంచనాకృతులఁ గావించి
యతులిత శివసమయస్థులఁ జేసి
యసదృశలీల నమ్ముసిఁడిచౌడయ్య
వసుధ నెప్పటియట్ల వర్తించుచుండె.
ముసిఁడిచౌడయగారి యసదృశచరిత
మసలార వినిన నత్యర్థి వ్రాసినను 990
జదివిన సద్భక్తి సంపద లొందు ;
మదనారికరుణఁ బ్రమథలీల దనరు. *
సారజంగమపాదసరసిజయుగ్మ
ధారాళమకరందధౌతశిరస్క !
సారదనీరదహారనీహార
తారామరాహారధౌతయశస్క !
యంచితకర్ణరసాయనకల్ప
సంచితపరిపాక సత్యవచస్క !
మహనీయరుద్రాక్షమాలికాభూతి