పుట:Dvipada-basavapuraanamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

195

నగరిపొంతను విమానంబు రాఁ బనిచి
యల్లంత నల్లంత నపహసింపుచును
గల్లరిలోకులగము లేఁగుదేర
నడతెంచు నవ్విమానంబులో శవముఁ
బొడఁగని చౌడయ్య గడుదూరమంద
కృతకంపుశవముగా మతిలోన నెఱిఁగి
యతిదరహసితాస్యుఁ డగుచు నుప్పొంగి
"యవికలాజాండంబు లలిగినఁ జెఱుపఁ
దవిలి కూర్చినఁ గావ దక్షులైనట్టి 950
మదనారి భక్తులమహిమఁ దలంప
నిది యెంత పెద్ద దానీరూపమునకుఁ
బడయుదు నోడలును బ్రాణంబు" ననుచు
మృడభక్తమండలియడుగులు దలఁచి
వడిగొని డగ్గఱి వాలార్చి చూచి
నిడిసేసి గాయంబు గడు మనసూపి
యందుండి లంఘించి యావిమానంబు
నందున్న కృతకాంగు హస్తంబు వట్టి
గ్రమ్మనఁ “దపసి లే లె"మ్మని పిలువ,
నమ్మాత్రలోన జీవాంగుఁ డై లేచి 960
ముసిఁడిచౌడయకంటె ముందఱ నిలిచి
వసుధపైఁ దజ్జనావలి సోద్యమందఁ
జవుడయ్యగారి శ్రీచరణాబ్దములకుఁ
దవిలి సాష్టాంగుఁ డై తా మ్రొక్కి నిలిచి
“హరుఁడవు నీవ ; సద్గురుఁడవు నీవ :
కరుణింపు మీపాదుకాతతి మోవ !
ఖ్యాతిగా భవదీయకారుణ్యగర్భ
జాతుండ ; నన్యధా నీతు లెఱుంగ"
నంచుఁ బ్రార్ధన సేయు నాతని నపుడ
సంచితగురులింగ సంగతుఁ జేసి 970