పుట:Dvipada-basavapuraanamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

బసవపురాణము

నతనిమహాద్భుతోన్నతిఁ జూడఁజాల
కతిమతిహీను లై యన్యదర్శనులు
“తొడఁగూడుపోతుల జడలతమ్మళ్లఁ
బడయుఁ దానటె చూ సబంబులఁ గన్నఁ
జవుడయ్యగారలచందంబు సూత
మవుగాఁక తప్పేమి ?" యనుచు దుర్భుద్ధి
గోనెగర్భం బిడి మానిసి రూపు
దానిల్పి బూడిది దళముగాఁ బూసి 920
యన్నిగందువల రుద్రాక్షము ల్వూన్చి
జన్నిదంబులు వెట్టి జడలను బెట్టి
యడిపొత్తి సించి కచ్చడము సంధించి
కడపట నొకవాడుగుడికడ వైచి
యింతట నంతట నెఱుఁగనియట్ల
సంతల నిలిచి దూషకులు సెలంగ
“నక్కటా ! గుడికడ నది యొక్కదపసి
దిక్కుమాలినపీన్గు ద్రెళ్ళియున్నదియు
కుడువఁ గట్ట విడువ ముడువ లే దనియొ 1
బడుగుఁబీనుఁగుగాన భక్తులు రారు : 930
ఎల్లవారికిఁ బ్రాణ మేమి నిత్యంబు ?
చెల్లఁబో యెవ్వరుఁ జేర రియ్యెడకు
నెట్టు సూడఁగవచ్చు నింక ధర్మంపుఁ
గట్టియయైనను బెట్టుదం" డనుచు
దమ్మళ్లఁ గొందఱఁ దపసులఁ బిలిచి
గ్రమ్మన నొక విమానమ్ముఁ గల్పించి
“గుడికడ నెన్నటఁగోలె నున్నదియొ ?
పడికి వచ్చెడుఁ జేరి పట్టరా" దనుచుఁ
దార యాకృతకంపుఁదపసిశవంబుఁ
జేరి విమానంబుఁ జేర్చి సంధించి 940
జగదభినుతుఁ డగు చౌడయ్యగారి