పుట:Dvipada-basavapuraanamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

189

వారించి “యిదివ్రాఁతవా”ర్తని యొద్ది
వా రెల్ల నుడుప నవారితవృత్తిఁ 770
బసరింపఁ “గ్రొ త్తేమి ప్రాఁతేమి యింక
బసవనిమృతి సెవిఁ బడ్డపిమ్మట ?
మురియుచు బసవఁడు ముందఱఁ జనక
పరిణయంబున కేఁగఁ బంతమే నాకుఁ
బడయక పోయెడుపలుకులే?” లనుచుఁ
బెడబొబ్బ లిడుచు సంప్రీతి నార్చుచును
"వెడలుము వెడలుము వృషభేంద్ర !" యనుచు
వడి నెయ్దియలుఁగున వటమూఁది నిలువ
నటమున్న నందిపాఁ తదరి యద్ధరణి
పటపటఁ బగులంగ పటవిటపంబు 780
చట్టన వ్రేళ్ళతోఁ జటచట మనఁగఁ
గట్టెగస ల్లంత మిట్టిపడంగ
నందఱు నతివిస్మయాక్రాంతులుగను
నందుండి యూఁకించి యవనికి నుఱికి
నిలిచి నిట్రించి ఘణిల్ఘణి ల్లనఁగ
నలరుచు జంకె లందంద వై చుచును
వాల మల్లార్చుచుఁ గాలఁ ద్రవ్వుచును
నేలఁ గోరాడుచు నీడ కుర్కుచును
నుడువీథి కెగయుచు నొడలు వెంపుచును
వడిగొని పఱచుచు నిడుజంగ లిడుచుఁ 790
దగిలి గద్దించుచుఁ దలఁకుచు మూతి
యిగిలించుకొని మొగంబె త్తిచూచుచును
జిఱు పెండ వెట్టుచుఁ జిఱలు వొడ్చుచును
గుఱుజంగ లిడుచు దిక్కులు సూచికొనుచు
గెలఁకులఁ దన్నుచుఁ గ్రేళ్ళువాఱుచును
బులుగఱ చుమియుచుఁ మలఁగి నాకుచును
బోరన నెగయుచుఁ బొంగుచుఁ గొమ్ము