పుట:Dvipada-basavapuraanamu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

బసవపురాణము

నత్యద్భుతాక్రాంతు లై నరు ల్వొగడఁ 740
దో డ్తొన తవరాజుఁ దోడ్కొని పెండ్లి
కే డ్తెఱ దళుకొత్త నేఁగంగ-నవలఁ
బొలమేర వటవృక్షములసమీపమున
నలిరేఁగి గోపాలకులు నటింపుచును
గములేర్చి యుద్దించి కాల్గన్నవారిఁ
దమలోనఁ గేలివాదంబు వుట్టుటయు
“గోకులపతియాన గుఱియది మీకు
మాకును బసవనిమఱ్ఱియ" యనుడు
న్యగ్రోధములయర్త నడచుచు సజ్జ
నాగ్రగణ్యుండు సౌడయ్య యాలించి 750
పసులవాండ్రను గూడఁ “బద రిదియేమి
బసవనిమఱ్ఱి యన్పలు కయ్యె" ననినఁ
బ్రెబ్బొంత పెయ్యలపెద్ద యందొకఁడు
“నిబ్బసవనివార్త యెఱుఁగుదుఁ గొంత ;
యట తాతచే వింటి నని తమతాత
చిటిపొటివాండ్రకుఁ జెప్పె మాకెల్ల :
నలుక రెట్టింప లెండాఁబోతు లిచట
మలయుచు నేడ్దినంబులు వోరఁబోర
నెత్తురు వఱద లై నేలయంతయును
జొ త్తిల్ల నొక వోతు సొలసి చచ్చుడును 760
నచ్చోన పాతినఁ జెచ్చెర మొలచె
నచ్చుగా నీమఱ్ఱి ; యట్లు గావునను
బసవనిమఱ్ఱి యన్పలుకయ్యెనండు
రసలార మఱియుఁ జోద్యం బట్లుఁగాక
కఱచిన మాంసంబు గతి నుండుఁ బండ్లు ;
విఱిచినరక్తంబువిధి నీరుగాఱు :
నేనాఁట మఱ్ఱిపా లెఱ్ఱనై యున్నె :
తానమ్మరే చూడఁ దథ్య" మి ట్లనుడు