పుట:Dvipada-basavapuraanamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

187

నసమానలీలఁ కళ్యాణంబునందు
ముసిఁడిచౌడయమహోల్లసనప్రయుక్తి
నెడపక సద్భక్తి కెల్ల యై యిట్లు
నడచుచు, మఱియొక్క నాఁ డుత్సవమున
నార్యులు దీవించి యనుప వివాహ
కార్యార్థమై యరుగంగ, గట్టెదురఁ
గటకంబు రాజమార్గంబునఁ జెలఁగి
నటియించు భక్తగణంబులనడుమ
ఘనవిమానస్థుఁ డై గగనమార్గమునఁ
జనుదెంచు తవరాజుశవము వీక్షించి 720
“వావిరి తవరాజవల్లభుచేత
దీవెన లందక పోవంగఁ దగునె?
పరిణయింబున కిత్తపస్వి యే తేర
కరిగెడువాఁడఁ గా నటు నిలుఁ" డనుచు
నలుఁగుమోహణమున హస్తంబు దొడిగి
జళిపించి మొనసూపి నలిరేఁగి యార్చి
యరుదెంచి డగ్గఱి “యయ్యగారలకు
శరణార్థి శరణార్థి శరణార్థి" యనుడు
“శివమస్తు శివమస్తు శివమ" స్తటంచుఁ
దవిలి తోడ్తోడన తపసి దీవింప 730
“డిగు డిగు గొరగ! నా కిగవడి తింక
నగవు గా దిచట నున్నను సయిరింప ;
నందివాహన ! నీకు నరవాహనంబు
పొందగునే చూచి భువి నరు ల్నగఁగ” ?
ననుచుఁ బాదము వట్టి యల్లార్చి తివియఁ
గనుఁగొని దరహాసకలితాస్యుఁ డగుచు
ధర డిగ్గి ముసిఁడిచౌడరసు నందంద
కర మఖిలాషమైఁ గౌఁగిటఁ జేర్ప,
సత్యస్వరూపుఁడు సౌడరాయండు