పుట:Dvipada-basavapuraanamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

185

విన్నను జదివిన విస్తరించినను
మృడుదయామృతరస మిళితేక్షణమున
నొడఁగూడు వారి కిష్టోపభోగములు,

—: ముసిఁడి చౌడయ్య కథ :—


ఆసదృశలీలఁ బెంపారి వెండియును
ముసిఁడిచౌడయ్య నా ముక్కంటిగణము
నిఖిలసజ్జనభక్తముఖముకురంబు ,
సుఖశీలసంబంధ సుపథప్రచారి, 660
అఫలార్థకృతసత్ క్రియాసమన్వితుఁడు,
సఫలీకృతామోఘ సత్యప్రతాపి ,
తజ్ జ్ఞుఁడు, సంసారతలగుండుగండఁ,
డజ్ఞానజనదూరుఁ, డపగతభయుఁడు,
నీరరసాంభోధి గారణపురుషుఁ,
డారూఢదివ్యామృతావలోకనుఁడు,
నధికశాపానుగ్రహసమర్థుఁ , డఖిల
విధినిషేధక్రియా విరహితాత్మకుఁడు.
అక్షయకీర్తిదృష్టాదృష్టలోక
సాక్షిక ప్రత్యయచరలింగమూర్తి 670
స్వసమయభూతి శాసనజనాధారుఁ ,
డసమానవీరభద్రసమానుఁ డనఁగఁ
బరఁగుచు_నాఁబోతు భక్తుఁడు దపసి
మరణంబు నొందిన మగిడించు బాస,
నడచుచో నంబుధి నది యడ్డ మైన,
నడఁగించి త్రోవన యరిగెడుబాస,
భక్తి సత్క్రియులు దప్పక చేయుబాస,
వ్యక్తిగా భక్తి నియుక్తిఁ బెంపారి
భువి నొప్పి ముసిఁడి యన్సురవరంబునను
సవిశేషభక్తి మైఁ జౌడయ్య యుండ- 680
బసవనిభక్తి సౌభాగ్యమహత్త్వ