పుట:Dvipada-basavapuraanamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

179

సభయాత్ముఁడై యున్నఁ జయ్యన నెత్తి
యసలారఁ గౌఁగిట నందంద చేర్చి
బసవనిఁ గారుణ్యర వార్థిఁ దేల్చి,
యలరంగ మృదుమధురాంచితాలాప
ములఁ బ్రబోధించుడు నలి దులుకాడ
మారయ్యగారికి మఱియును మ్రొక్కి
యారఁగ బసవరా జరిగె; నంతటను
మోళిగమారయ్య ముందటియట్ల
లాలితభక్తిసల్లీలమై నుండె: 490
నారఁగ మోళిగమారయ్యగారి
చారుచరిత్రంబు సదివిన విన్న
నిత్యప్రసాదవినిర్మలాత్మీయ
సత్యసుఖంబులు సల్లీలఁ గలుగు.

—: కన్నద బ్రహ్మయ్యగారి కథ :—


పరగంగఁ గన్నదబ్రహ్మయ్య నాఁగ
ధర నొప్పు సద్భక్తిపరుఁడు వెండియును
దర్పితసంసారదళనుండు జంగ
మార్పిత ప్రాణ దేహార్థాభిమాని
యద్భుతచరితుఁ డుద్యద్భక్తియుక్తి
సద్భావనోపేత చరలింగమూర్తి 500
సారవీరవ్రతాచారుండు జంగ
మారాధకులలోన నగ్రగణ్యుండు
సంచిత బాహ్యపూజాపరతంత్రుఁ
డంచితాంతస్ససర్యాపరాయణుఁడు
నిరవద్యహృద్య వినిర్మలభ క్తి
పరతంత్రుఁడన లసచ్చరితఁ బెంపారి
కత్తియు బలపంబుఁ గావిచీరయును
గత్తెర యిసుము నక్షతలును ముండ్ల
బంతియు నీలికప్పడమును ద్రిండు