పుట:Dvipada-basavapuraanamu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

బసవపురాణము

“నన్నన్న ! యిట్లేల యానతిచ్చెదవు ?
ని న్నన్న దేమేని మున్నొండు గలదె ?
బడుగు భక్తులకెల్లఁ బ్రాణంబు నిన్నుఁ
గడ సన్న భక్తులు గలరె యిబ్బువిని
మాబోటిభక్తులమనికియు నునికి
నీబయిసియె కాదె నిఖిలోపకార :
విని యెఱుఁగము దొల్లి విడియ లనంగఁ
గనుఁగొనఁబడియె నీకారణంబునను 460
బాపు ! భాగ్యప్రాణి : బాపు ! కృపాత్మ !
బాపురే ! ధనవంత ! బాపు ! కీర్తీశ !
నల్లవో బసవయ్య నా కిచ్చినట్టు
లెల్ల భక్తాళికి నిత్తయ్య : తొల్లి
మడివాలుమాచయ్య మనుమల మమ్ము
విడువక నడుపుకో వేయును నేల ?"
యని పెక్కు భంగుల నాలి సేయంగ
ఘనతరశోకాంబుకలితాస్యుఁ డగుచుఁ
“గనకాద్రి యరయునే కాకిగుణంబు ? 470
నినుముగుణ మరయునే పరుసంబు ?
గుణనిధి వీవు : దుర్గుణనిధి నేను ;
గణుతింపఁ గలదె సద్గుణము నాయందు ?
వెలివాడఁ గలుగునే వేదఘోషంబు ?
నిల నావమునఁ గల్గునే రాగిముంత ?
తలఁపఁ గుంపటిలోనఁ దామరదుంప
మొలుచునే ? యిన్నియు ముదలింప నేల ?
తగవివేకునిఁ గావఁగాఁ దగు నీవ
గతి దయాభావ ! సంగయదేవ !" యనుచు
మారయ్య పాదపద్మంబుల కెరఁగి
సారాంచితో క్తుల సంస్తుతింపుచును 480
నభయంబు వేఁడుచు నడుగులమీఁద