పుట:Dvipada-basavapuraanamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

161

సర్వస్థలై కభాస్వర సంగనాఖ్య !
ఇది యసంఖ్యాత మాహేశ్వరదివ్య
పదపద్మసౌరభభ్రమరాయమూణ
జంగమలింగ ప్రసాదోపభోగ
సంగత సుఖసుధాశరధినిమగ్న 790
సుకృతాత్మ పాలకురికి సోమనాథ
సుకవిప్రణీత మైశోభిల్లి తనరి
చరలింగ ఘనకరస్థలి విశ్వనాథ
వర కృపాంచింత కవిత్వస్ఫూర్తిఁ బేర్చి
చనుబసవపురాణ మనుకథయందు
ననుపమంబుగఁ జతుర్థాశ్వాస మయ్యె . 796