పుట:Dvipada-basavapuraanamu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

బసవపురాణము

గొనకొని యాద్రోహిఁ గూడునే తలఁప? "
నన సిరియాలుండు విని యంత శోక
వనధిఁ దేలుచుఁ దలవంచి లజ్జించి
యడఁకుచు నిశ్చేష్టితాత్ముఁడై యుండఁ,
బడఁతి నిర్మలభక్తి భాతికి మెచ్చి
యంతకుమున్న నిజాకృతిఁ దాల్చి
యంతకాంతకుఁడు ప్రత్యక్షమై నిలువ 650
“నోహో! యిదేమయ్య ! యుచితమే యిట్టు
లాహా ! మహాత్మ : మహాత్ములగుణమె?
యఱిముఱిఁ జన్నుఁబా లర్థించి యేడ్చు
చిఱుతచే నొకపిండికఱు డిచ్చి తల్లి,
తనచన్ను మఱపించి కొనిపోయినట్లు
చనరాదు నిమ్మిచే సందేహపడకు ;
మొడలికిఁ బ్రాణంబు నొడలు ప్రాణమున
కొడఁబడియున్నట్టు లుభయనామములు
నమరెడు లింగజంగమమూర్తి విడిచి
భ్రమకు హేతువులగు భావము ల్దాల్ప 660
నవ్వరే నిన్నును నన్నును భక్తు
లివ్వేడబంబులకెల్ల లోనైన
నేల యీబాహురూపులే నేమి నిన్ను
సోల వెల్తిగ మున్ను సూచితినయ్య !
ముక్కంటి వై మఱి మూఁడునుగన్ను
లక్క జంబుగ నున్న నవియు లేకున్న
హరరూప మైయున్న నరరూప మైన
గురురూప కాదె సద్గురుసన్నిహితులు :
కఱకంఠ ! యి ట్లేల కళవళించెదవు ?
వెఱవకు వెఱవకు వేఱకాఁదలఁప 670
వేయేల గుండయ్య ప్రాయంబు వడయ
నేయఱ్ఱుకప్పుతో నేఁగితి చెపుమ ?