పుట:Dvipada-basavapuraanamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

బసవపురాణము

మండనం బొలయ సౌమ్యపుఘంట లులియ
రావిరేకయుఁ దూల భావంబు వోల
నావిధియు నదల హర్షంబు వొదల
నందెలు మ్రోయ మోక్షాంగన డాయ
సందేహ ముడుగ నాశ్చర్యంబు దొడుగఁ
జూపఱు గీర్తింప సురలు శంకింపఁ
దాపసి వీక్షింపఁ దండ్రి మైవెంపఁ
దల్లి గౌఁగిలి సాఁపఁ ద్వరితంబు దోఁప
ముల్లోకములుఁ జూడ ముద్దు దుల్కాడఁ 540
బఱతెంచె సుతుఁడు; నప్పాట నీశ్వరుఁడు
కఱకంఠుఁ డజుఁ డుమాకాంతుఁ డుగ్రాక్షుఁ
డక్షరుం డాసిరియాలుకట్టెదుర
నాక్షణంబునన ప్రత్యక్షమై నిలువ ,
నంతలో సిరియాలుఁ డతివయు సుతుఁడు
నంతంత ధరణి సాష్టాంగులై మ్రొక్కి
కలగని మేల్కన్నకరణి నద్భుతము
దళుకొత్తఁ జెలఁగి కీర్తనలు సేయఁగను
“శ్రీశ వాణీశ సురేశ సన్మునిగ
ణేశ దిశాధీళు లెలమి నంకింప 550
నారుద్రగణములు నాపురాతనులు
వీరభద్రాదులు పేరి కొల్వంగ
సద్భక్తు లతులితోత్సవలీలఁ దనర
నద్భుతా క్రాంతాత్ములై నరు ల్వొగడ
నలరి చంచననంగ నాప్తవర్గంబు
నల తిరువెంగాణినంగఁ దత్సఖుల
సంచితమతి సిరియాలు సీరాలుఁ
గంచేడువాడలు, గై లాసమునకుఁ
బ్రవిమలకనక దివ్యవిమానపంక్తి
దివిఁ దేజరిల్ల నద్దేవ దేవుండు 560