పుట:Dvipada-basavapuraanamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

151

లలవడె నేఁడు నాయయ్య : రావయ్య !
దండధరోద్దండ దండప్రశక్తి
ఖండింపనోపు పుత్త్రుండ : రావన్న !
పాయనివ్యామోహపాశబంధములు
కోయంగఁజాలు నాకుఱ్ఱ : రావన్న !
ద్రవిణాదికేషణత్రయ విజృంభణము
తవులునఁ బడనినాతండ్రి : రావన్న ! 510
సురరాజనుతుఁడు విశ్రుతతపోవేషి
వరదుఁడైనాఁడు నావడుగ ! రావన్న !
యంతకాంతకమూర్తియగు [1] తవరాజు
సంతసంబంద నాసామి ! రావన్న !
ఘోరనిస్సార సంసారవారాశి
పార మీఁదించుపాపండ : రావన్న !
యంచితాగణ్య పుణ్యప్రాప్తి నమరు
కాంచీవిలాసు నగ్రజుఁడ ! రావన్న !
దివిజకన్యకలతో దివి ముక్తి కన్య
కవయనున్నది భక్తికాంతుండ : రావె ! 520
దందడి మీయయ్య దక్షిణభుజము
నందంద యదరెడి నన్న : రావన్న ,
భానుఁ డెంతేనియుఁ బడుమట వ్రాలె
శ్రీనిలయుండ ! నా సీరాల ! రావే !
స్వాదొంద నర్దేశ సఖునిసన్నిధిఁ బ్ర
సాదంబుఁ గొనఁగ నాగాదిలి , రావె!"
యనుచు నాలుగుదిక్కులందు నందంద
తనయునిఁ బిల్చుశబ్దంబులోపలను
జనిత మై దిక్కులసంజ్ఞలు దోఁప
వనితాలలామ విల్వంగ, నంతటను 530
గుండలంబులు గ్రాలఁ గూఁకటి వ్రేల

  1. తాపసి.