పుట:Dvipada-basavapuraanamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

బసవపురాణము

లేనినాఁ డొల్లము పాన లే ? " లనినఁ
జకితదేహుఁ డగుచుఁ జయ్యన మ్రొక్కి
"యకలంక : మీ రప్పు డన్నారు ; నేను
విన్నాఁడఁ ; బుత్త్రుఁడు నున్నాఁడు ; సదువు
చున్నాఁడొ ! యాడుచునున్నాఁడొ ! పిదపఁ 480
జనుదెంచి మఱి మీప్రసాదంబు వాఁడు
గొనియెడుఁగాక : భోజన మాచరించి
రక్షింపవే యోగిరములు శాకములు
అక్షయాత్మక ! చల్లనారకయుండ"
ననుచు మ్రొక్కుడును దదంగనఁ జూచి
“పనిచిన ‘నౌఁగౌక ' యని పిల్వరాదె ?
తల్లి పిల్చిన రాని తనములు గలరె?
తెల్లంబుగా నాల్గుదిక్కుల నిలిచి
యెలుఁగెత్తి పిలువుమా యేము వినంగ
నలరుచు రాకేమి యట్లయుండెడినొ ?" 490
యనవుడు “నుత్తరం బాడంగ నేల"
యనుచు నేతెంచి తూర్పాదిగా నిలిచి
చెలఁగుచుఁ దాపసి చెప్పినయట్టు
లెలుఁగెత్తి సుతుఁ దల్లి పిలువఁగఁ దొడఁగెఁ :

—: సంగళవ్వ కొడుకును బిలుచుట :—


“బూర్వజన్మార్జితభూరికర్మముల
గుర్వణఁగించు నాకొడుక ! రావయ్య !
దక్షిణాధీశ్వరుదర్ప మడంచు
దక్షత గల్గు నాత్మజుఁడ ! రావయ్య :
విరసపశ్చాజ్జన్మ మరణదుఃఖములు
పొరిమాల్పఁ జాలు నాపుత్త్ర : రావయ్య ! 500
యుత్తరం బేలు నుదాత్తయోగీంద్రు
చిత్తంబునకు వచ్చుశిశువ ! రావయ్య !
యలరు నాకోపభోగాతీత పదము