పుట:Dvipada-basavapuraanamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

149

మఱితెచ్చి యాశిరోమాంస మర్పింపఁ
గఱకంఠమూర్తి గన్గంట వీక్షించి
“యిల నెట్టియన్నదాతలు నిన్నుఁ బోలఁ
గలరయ్య ! యింతయుఁ గడుసాంగ మయ్యె ; 450
నేనాఁటఁ బ్రతి వోల్పలేని యభీష్ట
దానంబు సేసితి ; దీనికిఁ దగఁగ
నీవలపట మేము నీవు దాపటను
దేవతార్చనములు దీర్చి సపంక్తిఁ
గడుఁ బ్రీతితోడ లింగప్రసాదంబు
గుడువనినాఁడు నా కొడఁబాటు గాదు;
కంటి మంటి నని యాకాంక్ష నిదేమి
కొంటిమో తింటిమో కొడుకుమాంసంబు
నిచ్చ సేయంగ ము న్నిచ్చిన క్షణము
పుచ్చుకో నీవ యేఁ బోయెద నింక." 460
ననవుడు సెట్టి భయభ్రాంతిఁ బొంది
వనితఁ జూచుడు “నింక ననుమాన మేల?
ర" మ్మంచు లింగార్చనమ్ము సేయించి
క్రమ్మన వడ్డింపఁగాఁ దపోధనుఁడు
“నతిథిపూజలు సేయునవసరంబునను
సుతులును దారు నుత్సుకలీలతోడఁ
బొత్తునఁ గుడుతు రట్లుత్తమపురుషు ;
లిత్తఱి నీకైన నెట్లు సేయాడు. ;
నిప్పుడు గానరాఁ డేఁడ మీసుతుఁడు
చెప్పమే యిప్పుడు సిరియాల ! నీకు 470
నెన్నఁబుత్రులు లేనియింట మా కెట్టు
లన్నదానముఁ గొన నర్హ మౌ చెపుమ !
ధృతి 'నపుత్త్ర స్య గతి ర్నా స్తి' యనఁగ
గతిహీనులిండ్లఁ గుడుతురె సంయములు ?
కాన పుత్త్రుఁడు గలఁడేని పిల్పింపు :