పుట:Dvipada-basavapuraanamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

143

వెస నేఁగుదెంచి జయసమగ్రవృత్తి
మడివాలుమాచయ్య యడుగులపొంతఁ
బుడమి సర్వాంగముల్ వొందంగ మ్రొక్కి
“యాక్రాంత సంతతాహం కార నిరతు
నక్రమాలాపు నిర్వక్రాపరాధు
నూర్జితక్రోధు వివర్జితసత్యు
దుర్జనాచారు ననిర్ణితకాము 280
నజ్ఞానపుంజంబు నపగతశౌచు
విజ్ఞానహీను వివేక విదూరు
నిర్భాగ్యచూడామణిని భక్తి రహితు
దుర్భావకు నవినీతుని నన్ను నింకఁ
గాచి రక్షింపవే కారుణ్యపాత్ర !
యేచినమద్గర్వ మెల్ల మాయించి
లాలితంబుగ నాల్గు లక్షలమీఁద
నోలి నిర్వదినాల్గువేలగీతములు
గావించు టిది యెగ్గు గని యేవగించు
భావన నా కయ్యె నీవు గైకొనమి ; 290
నాయతప్రీతి నో యనకున్న నింకఁ
జా ! యనవయ్య నాసంగయ్య దేవ !"
యనుచు నిట్లాత్మనిందాతిదీనో క్తు
లను విన్నవించుడు విననట్ల వినియు
జంగమపరతంత్రుఁ డంగావిగారి
లింగదమాచఁ డాలీడశౌర్యుండు
“నధముఁడా ! క్రొవ్వితే ? హరభక్తు లరయ
నధములే ? నీ వొకయర్థాధిపతివె ?
యడిగెడువారు లేకయ్య నీ వింత
బడగ వై తివి; మజ : బాపురే !" యనుచు 300
“నట్టియాచకుల నే నటు గందుఁగాని
యిట్టిత్యాగులఁ గాన మేలోకములను ;
బాన లిన్నియు నేల ? బసవ ! నీయిచ్చు