పుట:Dvipada-basavapuraanamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ix

రనుట కాభక్తుని కథ తార్కాణము. బసవఁ డాతనిని సాక్షాచ్ఛవునిగా భావించి సేవించెను. అతఁడే యొకసారి బసవని గీతములో వినవచ్చిన యహంకారమును గర్జించి భక్తివలన భక్తున కత్యంత వినయసంపద యేర్పడవలయు నని ప్రాచీనభక్తుల చరిత్రములను పెక్కింటిని దృష్టాంతములుగాఁ బేర్కొనినట్లు వర్ణించుటచే నీయాశ్వాసము కడు దీర్ఘ మైనది. బసవని సమకాలికు లగు కిన్నర బ్రహ్మయాది భక్తుల మహామహిమలను బ్రతిపాదించుటతో పంచమాశ్వాసమైనది. షష్ఠాశ్వాసము జైనులతో వాదుపడి శిర మిచ్చి మహిమాతిశయములను బ్రదర్శించిన ఏకాంతరామాదులవంటి శివభక్తుల కథలతో నిండియున్నది. సప్తమాశ్వాసము కులమున కంత్యజుఁడయ్యు మహిమచే నున్నతుఁ డైన శివనాగుమయ్య వంటి భక్తుల చరిత్రలతో సాగి, బిజ్జలుఁ డకారణముగా నల్లయ్య మధుపయ్య లను భక్తులకన్నులు తీయించుటచే బసవేశ్వరున కాగ్రహము గలిగి కల్యాణకటకమును శపించి, భక్తమండలితోఁ గూడి సంగమేశ్వరమున కేఁగి లింగైక్య మందుటయు, జగదేవాదులు బిజ్జలుని వధించుటయు, ననతికాలములో నా రాజసంతతియు, రాజ్యమును నాశన మగుటయు నను కథాంశములతో ముగియుచున్నది.

మతాచార్యుని నవతారపురుషునిగా నిరూపించుటయే కాక, తత్పూర్వ జన్మవిశేషముల నభివర్ణించి ఆదిమూల మైన యతనిస్వరూపము నెఱిఁగించి, ప్రస్తుతావతారహేతువును నిర్దేశించిన కథాభాగ మీ పురాణేతివృత్తమున ప్రస్తావనగా నలరారుచున్నది. బసవేశ్వరుఁడు తొలుత సృష్ట్యాదియం దున్న ధర్మస్వరూపుఁ డగు నాదిపృషభేంద్రుఁడు. ఆపైన శిలాదుని తపఃఫలముగా నాతఁడు నందీశ్వరుఁ డై జన్మమెత్తి ద్వితీయశంభుఁ డని కీర్తిఁగాంచెను. నందీశ్వరుఁడే శైవమతోద్ధరణకై బసవేశ్వరాఖ్యతో భువియం దవతరించెను. దీనికి సూత్రధారుఁడు పరమేశ్వరుఁడు. ఇంతకంటె పురాణమున కుదాత్తారంభ మేమి యుండును ? సృష్ట్యారంభాఖ్యసర్గాదికథన మార్షపురాణారంభ మై యుండగా ఆచార్యపూర్వావతార కథాకథన మీ పురాణ ప్రస్తావన మై పరిఢవిల్లినది.

జైనపురాణములయందలి తీర్థంకర చరిత్రలలో పంచజినమహాకల్యాణ