పుట:Dvipada-basavapuraanamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

బసవపురాణము

లోకంబునెల్లఁ గల్లోలమార్చెడిని ; 80
జాకికి నింతేల [1]స్రడ్డలు ? జనులఁ
జేకొన కడిచెడుఁ జేరంగవీక ;
యిట్టిచోద్యంబు లేమెఱుఁగ మేనాఁట
ముట్టినఁ జీరలు ముఱుగునే చెపుమ ?
పురజనులకు మున్నె చరియింపరాదు
పరదేశి కింక రాఁబాసె మాపురికి ?
నెంతబల్లిదుఁడొ నేఁ డ్వింతవాఁ డొకఁడు
సంత కేఁగఁగఁ జంపె శవమును లేదు
ఆకసంబున కేఁగు నట్టలు, గలదె ?
దాకి రక్కసిక్రియ జనుల మ్రింగెడని. 90
తిట్టఁడు వలుకఁడు ముట్టినమాత్ర
నిట్టు సంపఁగఁ గూడునే పెఱవాండ్రఁ ?
బాడీఁ దలంపక బత్తుండ ననుచుఁ
దాడుగాఁ జంపు నీపౌరులనెల్ల ”
ననుచుఁ బురోహితు లనుమతంబునను
దనయామికులఁ జూచి ధారుణీశ్వరుఁడు
“చాకి నచ్చోటన చంపుండు ; వొండు ;
కాక మ్రింగిన వానిఁ గ్రక్కిన రండు !"
అనవుడు బసవఁ డిట్లనియె నాతనికి :

—ː బసవఁడు బల్లహునకు మడివాలు మాచయ్యమహిమఁ జెప్పుట ː—


"విను మీఁదెఱుంగక వెడలనాడెదవు 100
లేకులు లోకుల కాకఱపులకుఁ
"జాకి చా" కని యేల సందడించెదవు ?
చాకియే యతఁడు ? సాక్షాల్లింగమూర్తి
కాక యేటికిఁ గనుకనిఁ బలికెదవు ?
కులజుండు నతఁడెయకులజుండు నతఁడె;
కులము లేకయు నన్నికులములు నతఁడె ;

  1. ఔద్ధత్యములు.