పుట:Dvipada-basavapuraanamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

135

—: మాచయ్య తెరువరుని జంపెనని పౌరులు బల్లహునకుఁ జెప్పుట :—


వీరువారన కెల్లవారును గూడి
ధారుణీశ్వరు సభాస్థలి కేఁగి మ్రొక్కి
"బల్లహ ! వినుము నీపట్టణంబునను
బ్రల్లదుం డొకచాకి బత్తుండ ననుచు
మొలఁ గఠారము గట్టి తొలఁగండు ద్రోవ
తొలఁగించు నేబల్లిదులఁ [1]బిఱుసనఁడు ;
చాటుఁ “జీరలమూట సంధిల్లి రేని
పోటు ముందఱ" ననిపోటులమాట 60
నంగళ్ళు నిలిపె బేహారము ల్మాన్చె ;
సంగడి నిటయట సరియింపరాదు;
పురవీథి నెవ్వరేఁ బోయినఁ జూచి
పరిగొని కనుకనిఁ బాఱంగఁ దోలు;
నెదురను బసి గుఱ్ఱ మేనుంగు బండి
యదియేమి సోద్దెమో కదియంగ వెఱచు
నల్లంతఁబొడగని చల్లన నవసి
కల్ల వెల్లై పాఱుఁ గథ లేల ? నేఁడు
వింత వాఁడొకఁడు ము న్వినమిఁగాఁ జేసి
సంతకుఁ బోవుచో సంధిల్లి నంతఁ 70
బొడిచి మీఁదికిఁ జిమ్మెఁ ; బొందియు నచటఁ
బొడలేదు ; మ్రింగెనో ! పోయెనో దివికి !
నట గార్య మెఱుఁగ మే మవనీశ ! వినుము.
ఇట వచ్చితిమి నీకు నెఱిఁగింప"ననిన
బసవనిదెసఁ జూచి పార్థివేశ్వరుఁడు
కసిమసంగుచు మహోగ్రత నిట్టు లనియె :
“నిది యేమివిపరీత మింక నెవ్వరికిఁ
బ్రదుకంగవచ్చు నీభక్తులచేతఁ ?
గోక లుదుకుచాకి గ్రొవ్వి యిప్పురము

  1. లెక్క సేయఁడు.