పుట:Dvipada-basavapuraanamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

131

స్వామి ! సర్వజ్ఞాన ! సకలేశ !" యనుచు
నంతంత సాష్టాంగుఁ డై మ్రొక్కి నిలుచు
నంత వారికృపఁ గళ్యాణంబునందు
బసవనియెదుటఁ బెంపెసఁగంగ నిలిచె.
నసముండు మాదిరాజయ్య తత్‌క్షణమ
యిట బసవఁడు సంగమేశ్వరునందు
నటమున్న పొడగాంచి సాష్టాంగ మెఱఁగి
మ్రొక్కునమ్మాత్రన ముందట నున్న
నక్కజుం డగుచు నందంద మ్రొక్కుడును 1520
వత్సలత్వంబు నివ్వటిలంగ నతులి
తోత్సవలీలమై నుల్ల సిల్లుచును
సంచితలింగసుఖాపారసార
సంచితామృతవార్ధి ముంచి యెత్తుచును
బసవనిచేఁ బూజ వడయుచు నుండె
నసలార మాదిరాజయ్యగా ; రిట్టు
లీజగత్త్రయి సకలేశ్వర మాది
రాజయ్యగారి నిర్మలచరిత్రంబు
విస్తరించినఁ బ్రీతి విన్న వ్రాసినను
బ్రస్తుతభక్తి శుభంబులు సెందు. 1530
ధీమణి ! సుజనచింతామణి ! బుధశి
ఖామణి ! ధర్మరక్షామణి : శుద్ధ
శరణజనానందకరణ ! సత్పథవి
హరణ ! సంతతదయాభరణచేతస్క !
లలిత నిర్మలయశఃకలితదిగంత !
ఫలిత సద్భక్తి సమ్మిళితాంతరంగ !
రహితషడ్భావ ! విరచితసద్భావ !
మహిత తత్త్వార్థ సన్నిహితావధాన :
విదిత ప్రసాద సంవిత్సౌఖ్యభోగ
ముదితాత్మ ! సంగాఖ్య : మృదితేంద్రియౌఘ : 1540