పుట:Dvipada-basavapuraanamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

129

పొంగి చిచ్చుఱుకంగఁ బోవుచుఁ జీర
కొం గోసరించు పెన్వెంగలియట్ల,
చెల్లుఁ బొ మ్మని సన్న్యసింపఁ బోవుచును
ని ల్లప్పగించు న [1]య్యిబ్బందియట్ల,
పదపడి నూతిలోఁ బడఁబోయి తాప
వెదకుచు మెట్టెడివీఱిఁడియట్ల ,1460
జ్ఞానాత్ముఁ డై సర్వసంగముల్ విడిచి
తా నాశ్రమముఁ గోరు తపసిచందమున,
నిల మరు ల్వోయే రోఁకలి గొనిరండు
తలఁ జుట్టుకొనియెదఁ దా నన్నయట్లు,
పానలేల చెఱకుపండెమం దొక్క
యీనె సిక్కిన నోడుటేకాదె తలఁప ?
రోసి సంసారంబుఁ బాసి యొక్కింత
యాసించె నేనియు నది వెల్తిగాదె ? "
యని తన్ను ముదలించుడును నెట్టయెదురఁ
దనతొంటి భావంబుఁ దాల్చినఁ జూచి 1470
కనుమూసి తలవంచి కలయ లజ్జించి
మనతరశోకాశ్రుకలితాస్యుఁ డగుచు
“నెక్కడి భక్తి ? నా కెక్కడి ముక్తి ?
యెక్కడఁ జూచినఁ దక్కునే మాయ ?
గతి మతిచైతన్య కర్మక్రియాదు
లతిశయం బై కల్గు నంతకుఁ దనదు
క్రియ యెట్టు లట్లు వర్తింపక శివుని
దయ వడయంగ నిశ్చయ మెట్లు వచ్చు ?
గసుఁగాయఁ ద్రెంచినఁ గా యగుఁగాక
పసనిపండగునయ్య భ్రాంతిఁ బొందినను 1480
సాశ్వత కీర్తి నిశ్చల భక్తి యుక్తి
యీశ్వరుకృప లేక యేల సిద్ధించు ?

  1. ఇబ్బంది = అజ్ఞాని.