పుట:Dvipada-basavapuraanamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

బసవపురాణము

యతిదయాపరుఁ డన నుతికి నెక్కండె ?
యితనినేత్రంబు ము న్నీశున కున్న
నతిభూమిసౌందర్యుఁ డన భువిఁ జనఁడె ? 1200
యిట్టి నేత్రంబు ము న్నెప్పుడు నున్న
నెట్టి కాంతల మెచ్చునే హరుఁ ? డనఁగఁ
గన్నప్ప నేత్రంబుకతమున నీశుఁ
డెన్నంగ సర్వసంపన్నుఁ డై నెగడెఁ ;
గన్నప్పపాదరక్షాస్పర్శ శివుఁడు
సన్నుతభక్తవత్సలుఁ డనఁ బరఁగె;
నీచెప్పు నాఁడు దన్నింత సోఁకుడును ;
నాచంద్రుఁ డబినంద్యుఁ డయ్యె లోకముల ;
నీచెప్పునాఁడు ద న్నింత సోఁకుడును
నేచిన తీర్థ మై యిల నొప్పె గంగ ; 1210
యీచెప్పు దా నయ్యెనేఁ బద్మభవుఁడు
చూచున కాదె యీశునిమస్తకంబు
శ్రీపతి గానని శ్రీమహాదేవు
శ్రీపాదభక్తుల శ్రీపాదరక్ష
పరమేష్ఠి గానని యురులింగమూ ర్తి
శిరమున నొప్పు విశిష్టభూషణము ;
చెప్పెడి దేమి ? గన్నప్పపాదంబు
చెప్పు మహత్త్వంబు సెప్పఁ జిత్రంబు ;
ఇతని పాదోదకాయత సిద్ధిఁ గాదె
సితకరమౌళి ప్రసిద్ధుఁడై పరఁగె ; 1220
నితని నిర్మాల్యసంగతిఁ జేసి కాదె
రతిపతిహరుఁడు నిర్మలదేహుఁ డయ్యె !
నితనిగండూషాంబుకృతసేవఁ గాదె
జితపురత్రయదైత్యుఁ డతిలోకుఁ డయ్యె !
నితని ప్రసాదవిహితభుక్తిఁ గాదె
క్షితిధరకన్యకాపతి నిత్యుఁ డయ్యె !