పుట:Dvipada-basavapuraanamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

119

మృడుని మూఁడవ కంటిక్రింద నిర్గడల
సడర రెండును రెండు నై మించి వెలుఁగఁ 1170
జూపును జూచు తద్రూప ముదారు
నేపారఁ ద్రివిధంబు నేక మై యునికిఁ
దమ నేత్రములఁ దమ్ము దార వీక్షించు
క్రమ మయ్యె శివునికిఁ గన్నప్పనికిని ;
నెఱి నాల్గు గన్నుల నిజదీప్తి నంత
పఱగప్పి నట్లుండె ఫాలలోచనము ;
'కాలునే యింక నీకంటఁ జూచినను
నోలిఁబురత్రయం బొండు గల్గినను ?
గాలునే యింక నీకంటఁ జూచినను
నాలక్ష్మినందనుం డంగంబు గొన్నఁ ? 1180
గాలునే యింక నీకంటఁ జూచినను
గాలుఁడు వెండియుఁ గ్రమము దప్పినను ?
గాలునే యింక నీకంటఁ జూచినను
నేలోకమును నంత్యకాలంబునాఁడు ?
కన్నప్ప సదయాంబకము మున్ను శివుని
కున్న నట్లునుగాక యుగ్రాక్షుఁ డండ్రె ?
నాఁడ యీ కన్నప్ప నయన ముండినను
వేఁడునే సిరియాలు విందారగింప ?
నాఁడ యీ కన్నప్ప నయన ముండినను
బోఁడిగా సైఁచునే భ్రూణహత్యకును ? 1190
ఈచారునేత్రాబ్జ మీశున కున్నఁ
జూచునే నిమ్మవ్వసుతుచావు నాఁడు ?
పంబి యీయమృతాంబకం బున్న శివుఁడు
నంబి కన్నులు సెడ నాఁ డేల చూచు ?
నీ నేత్ర మున్న ము న్నీశుండు బాలుఁ
బోనిచ్చునే పాముపుట్టఁ దొడ్కంగ ?
నితనినేత్రం బున్న నిన్నియు నేల ?