పుట:Dvipada-basavapuraanamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

117

నాతనిచేఁ గొన్న యాకన్ను నిచ్చె
నో తన క న్నిచ్చెనో శివుఁ డనఁగ;
నంతకమున్ను వామాంబకజనిత
సంతతఘనబాష్పజలధార లుడిగి
కన్నప్ప దేవుని కన్నులు శివుని
కన్నులు వోల నొక్కం డైన యట్లు
కన్నప్పదేవుని కన్నుల నపుడు
సన్నుతానందబాష్పంబులు దొరిగె;
హరుకంటఁ దొల్లి ద్రిపురవీక్షణమునఁ
దొరిగిన జలములు దోడయ్యె ననఁగఁ 1120
గరుణానిరీక్షణ స్ఫురితాంబుధార
విరచింప నానందకర మగు టరుదె!
యంతట నిఖిలసురాసుర ప్రముఖు
లంతంత మ్రొక్కుచు నభయంబు వేఁడ,
మస్తక విన్యస్తహస్తు లై మునులు
ప్రస్తుతం బెఱుఁగుచుఁ బ్రస్తుతుల్ సేయ,
శివదుందుభులు మ్రోయ , భువిఁ బుష్పవృష్టి
ప్రవిమలం బై కుర్యఁ, బ్రమథు లుప్పొంగ.
గన్నప్ప శుద్ధముగ్ధతయు మహాగు
ణోన్నతియును భక్తి యోగసంపదయు 1130
నాపరాపరుఁడు ప్రత్యక్ష మై యునికిఁ
గోపించి మును పొంచికొనియున్న తపసి
కనుఁగొని సంభ్రమాక్రాంతాత్ముఁ డగుచుఁ
జనుదెంచి భువి జక్కఁ జాఁగిలి మ్రొక్కి
"తలఁప నీసహజ ముగ్ధత్వ మెఱుఁగమిఁ
దలఁచితి నీకహితంబు సేయంగఁ ;
దప్పు సై రింపు గన్నప్ప ! దయాత్మ !
చెప్ప నున్నదె నీవు శివుఁడవు గాక
యిట్టి ముగ్ధత్వంబు నిట్టి వీరత్వ