పుట:Dvipada-basavapuraanamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

బసవపురాణము

నర్పింప నపుడు మి మ్మారగించెదను."
అని యానతిచ్చుడు నసురు లాక్షణమ
చనుదెంచి ప్రజలును వనితలుఁ దారు
మృగము లై లింగసమీపంబునందుఁ
దగిలి జన్మించి యెంతయుఁ బ్రీతిఁ దమ్ము
నొరులకుఁ గానరాకుండ వర్తింప-
వరమృగావలి సేరవచ్చిన నుబ్బి
యొక్కొక్కకోలన యొక్కొక్కమృగము
నుక్కడఁగింపుచు నుత్సవం బలరఁ 860
జెచ్చెరఁ గోలలు దెచ్చి యాక్షణమ
త్రచ్చి మెల్లన మంట దరికొల్పి కాల్చి
మంచిమాంసముగ శోధించి శోధించి
పంచినమాడ్కి ఖండించి ఖండించి
కాల్చుచుఁ బక్వంబుగాఁ ద్రిప్పి త్రిప్పి
ప్రేల్చుచు వెండియుఁ గ్రియకొల్పి కొల్పి
తవిలి ఖండింపుచుఁ దాఁ జవిసూచి
చవియున్న లెస్స మాంసము దొప్పఁబెట్టి ,
చిఱుతయుఁ గఠినంటు ఛిద్రంబు మొఱకు
కఱకును గారాకు గాకుండఁ జూచి, 870
యింపారి నునుపారి కంపు సొంపారి
పెంపారి చాలనొప్పెడు బిల్వపత్రి
వలి దీటుకొనఁ గోసి తలసజ్జఁజేసి
యలరు జంజుఱువెండ్రుకలమీఁదఁ దాల్చి.
చక్కన మొగలేటి సదమలోదకము
లక్కజంబుగ రెండుపుక్కిళ్లఁ బట్టి,
దాపలికరమునఁ జాపంబు శరము
లేపార వలచేత నిట మాంస మున్న
దొప్పయుఁ బట్టి కన్నప్పఁ డేతెంచి,
చెప్పుఁగాలను దొంటి శివుమీఁద పూజ 880