పుట:Dvipada-basavapuraanamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

బసవపురాణము

లుండంగ వెఱవవా ఖండేందుమౌళి ?
మృగములు నురగము ల్మితి మేరలేవు.
నగవు గా దిచట నున్నను బ్రమాదంబు ;
ఎఱుకుఁ బన్నలు గన్న నేఁతురు నిన్నుఁ ;
గఱకంఠ : మాపల్లెఁ గల దెల్ల సుఖము,
అడవుల మనుబిళ్ళ కడు మంచిపాలు
నొడిపిలి పాసెంబు నుడుప నేతులును 800
నిప్పపూవును దేనె లెల్ల ఫలాదు
లొవ్పెడు వెదురు బ్రాలోగిరంబులును.
మఱి యట్లుఁ గాక నీ మనసు వచ్చినను
నెఱచులుఁ గఱకుట్టు లేన్నేనిఁ గలవు ;
రావయ్య ! మ్రొక్కెద దేవదేవుండ !
ప్రేవులు మాడంగఁ జావఁ దప్పినదె?”
యనుచుఁ బాదాక్రాంతుఁ డైన నీశ్వరుఁడు
దనతోడఁ బలుకమి మనసులోపలను
“నింత గాలమునుండి యిట గుడువండొ ?
కంతునిర్దళనుఁ డాఁకట బల్క లేఁడు; 810
చెవులు సిల్లులు వోవఁ జీరంగ నేల ?
శివున కేమేనిఁ దెచ్చెదఁ గాక !" యనుచుఁ
జని కందమూలాదిశాకముల్ మృగము
లును దృష్టి మాత్రలోనన పరీక్షింప..
మునుకొని “యంతకుమున్న ధరిత్రిఁ
జనిన జీమూతవాహనుఁడును శిబియుఁ
గీర్తి ముఖుండును గీర్తింప నాది
కర్తకు నర్పింపఁగా నెఱుంగమిని
దమ శరీరము లొండుగ్రమమున సమసి
యమితసాహసవంతు లనఁగ నిబ్భువిని 820
సవిశేషకీర్తి భాజను లైరి గాని
ప్రవిమలమతి లింగభాజను ల్గార"