పుట:Dvipada-basavapuraanamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

బసవపురాణము

గున్న ! యాఱడిపుచ్చఁగూడునే నన్ను
మలముల మఱుఁగుచు నిల నాడనేల
కొలఁదిదప్పినకుడ్పు గుడువంగ నేల ?
బ్రదుకున్న దే యిట్లు వై కుడ్పులందు
నది యేల కడుపూఁదదయ్యెడుఁ జెప్పుమ.
చన్నిత్తుఁ బలుమాఱు వెన్నయుఁ బాలు
నెన్నండు దప్పింప నెందైనఁ దెత్తుఁ
గుడుపు నీకెయిదదే కొడుక యిట్లేల ?
యడిగి కుడువఁబోయి తాదట లేక 690
యిన్ని దినంబులు నేరీతిఁ జాలె ?
నిన్న నీకడు పేల నిండదు సెపుమ ?
యేయెడ వంచింప రేయును బగలుఁ
జేయి దిగం డిట్టి [1]సితగుండు గలఁడె ? ,
యని యొండు వేసర సాసరఁ గన్న
జనినగదా యని చనవున బలుకఁ
దెల్ల మిప్పుడు మీఁదఁ దొల్లి నాయట్టి
తల్లులు గలరె యీముల్లోకములను ?
బనుగొన నీవు నా ప్రాణంబు గాఁగ
ననురక్తి గొనియాట కది నీవె సాక్షి ; 700
యెట్టేని మాయుంచినట్టుల యుండి
పెట్టినంత గుడిచి యట్టుండితేని
యెప్పాట నినుఁ బొందునే తెవు ల్నొప్పి ?
నిప్పునఁ జెద లంటునే ? నీకు నీవ
చేసికొనఁగఁ దెవు ల్సిద్ధించెఁ గాక
యీసంకటంబు నీ కేల తావచ్చుఁ ?
బనియేమి ? మాటలఁ బాయునే తెవులు
నిన్నుఁ గొంత వీఱిఁడితన మడ్గ నేల?
చాలఁ జూడంగ నీసంకటం బింక

  1. మంకుబిడ్డఁడు.