పుట:Dvipada-basavapuraanamu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

97

"సమయ నివ్విషమున సత్య మి ట్లనిన 540
నమ్మవే వలపలినాతొడ యెక్కి
నెమ్మిఁ జూచుచునుండు నీలకంఠంబు"
నని యూరుపీఠంబునందు ధరించె.
మును గుఱియున్నదే ముగ్ధత్వమునకు
నదిగాక కుత్తుక హాలాహలంబు
కదలినంతటనె చచ్చెదఁగాక ! యనుచుఁ
దనకరవాలు ఱొమ్మున దూసి మోపి
కొని కుత్తుకయ చూచుచును ఱెప్ప లిడక
పశుపతితొడమీఁదఁ బాయక రుద్ర
పశుపతి నేఁడును బాయకున్నాఁడు.* 550

—: బెజ్జమహాదేవి కథ :—


మఱియును విను బెజ్జమహ దేవి యనఁగఁ
గఱకంఠ శ్రీపాదకమలాంతరంగ
“యెల్ల నియోగంబు లెల్లబాంధవులు
నెల్ల వారలు గల్గ నిట్లు భర్గునకుఁ
దల్లి లేకుండుట దా విచిత్రంబు !
దల్లి లే కది యెట్లు దా నుదయించె ?
దల్లి సచ్చెనొ కాక త్రైలోక్యపతికిఁ
జెల్లఁ బో ! యి ట్లేమి సేయంగవచ్చుఁ ?
దల్లి సచ్చినఁ గాదె తాను డస్సితిని.
యెల్లవారికి దుఃఖ మిట్టిదకాదె ! 560
తల్లి గల్గిన నేల తపసి గానిచ్చుఁ ?
దల్లి గల్గిన నేల తల జడ ల్గట్టుఁ ?
దల్లి యున్న విషంబుఁ ద్రావ నే లిచ్చుఁ ?
దల్లి యుండినఁ దోళ్లు దాల్ప నే లిచ్చుఁ?
దల్లి పాముల నేల ధరియింప నిచ్చుఁ ?
దల్లి బూడిద యేల తాఁ బూయ నిచ్చుఁ ?
దల్లి వుచ్చునె భువిఁ దనయునిఁ దిరియఁ ?