పుట:Dvipada-basavapuraanamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

బసవపురాణము

అనఘ : త్రికాలలింగార్చన మీఁది
పనులు దక్కఁగ లేవు బగళులు రేలు ;
గతి మాకు వేఱొండు గలదె ? జంగమమ
గతి మనోవాక్కాయకర్మంబులందు : 340
ఇట్టిది గురుమార్గ మిది నిజవ్రతము;
ఇట్టిది సారిత్ర మిది లాంఛనంబు :
తలఁప మాగురుసంప్రదాయంబువారు
గలరు శ్రీగిరి యాదిగా నెల్లయెడల ;
నధిప : సాక్షాజ్జగదంబాసమాన
లధికంబు గలరు దక్షారామమునను"
ఆని సమంచితవిదగ్ధాలాపములను
వినుపింప, నాయయ్య విస్మితుం డగుచుఁ
జెలువ పర్యంకంబు సింహాసనముగఁ
దలఁచి, గంధద్రవ్యతాంబూలవితతి 350
యొడఁబడ నంత నొండొండు శోధించి,
“పడఁ తర్ఘ్యపణ్యముల్ వట్టు"నావుడును-
“దనరఁగ నీయయ్య మనసు వచ్చుటయుఁ
గనుఁగొన నానేర్పుకలిమి గా" కనుచు
హసనంబు దళుకొత్త నర్ఘ్యపణ్యములు
పసిఁడిబిందెలఁ బట్టి పడిగము ల్వెట్టి,
గ్రక్కున సకలోపకరణంబు లోలిఁ
జక్కొల్పి యమ్ముగ్ధసంగయ్య కలరఁ
గరమొప్ప గంటలుఁ గాంస్యతాళములు
నరుదొంద మ్రోయ ధూపానంతరంబు 360
దెఱవ యుదంచిత దృగ్దీధితులను
నఱితిహారంబుల యంశుజాలములఁ
బొలు పగు కంకణస్ఫురితరోచులను
మిళిత మై కన్నులు మిఱుమిట్లు గొనఁగ
వెలుఁగు నీరాజనంబులపళ్లెరముల
నలర నందిచ్చునయ్యవ్యసరంబునను.