పుట:Dvipada-basavapuraanamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

89

తరుణి ǃ మీగురుసంప్రదాయంబు వారు
ధరణి నేఠావునఁ దపము సేయుదురు ?
సంతతంబును నేరి సద్గోష్ఠి నుందు
రింతయుఁ జెప్పు మా కేర్పడ." ననిన 310
“నాగమనిగమోక్తి నవ్వామదేవ
యోగిచే శివదీక్ష యొప్పంగఁ బడసి
కైలాసమునఁ దపోవేళ మెప్పించి
శూలిచేఁ బడసె ము న్నీలాంఛనంబు.
అది గారణముగఁ బూర్వాచార్యురాలు
సదమలాత్మక హిమశైలతనూజ
శ్రీనందనునిఁ గెల్చి శివుని మెప్పించి
మేన నర్ధము గొన్న మెలఁతవర్గంబు ;
జగములన్నియుఁ దనశక్తిఁ బాలించు
జగదేకసుందరి సంతతి మేము : 320
శివరహస్యాదిప్రసిద్ధశాస్త్రములు
శివునిచేఁ బడసిన చెలువశిష్యలము ;
ఆకాంక్షతోడ జన్నావులపాలు
సేకొని యష్టావశేషంబు సేసి
చెఱకుకట్టెలపొడి సేరెఁడు సల్లి
మఱి యిష్టలింగసమర్పణ సేసి
తప్పక యీ ప్రసాదం బింతగొందు
మెప్పాటఁ గలనైన నెఱుఁగ మోగిరము ;
గలిగినే వెండియుఁ గందమూలాది
ఫలపత్రశాకముల్ భక్తు లిచ్చినను 330
స్వామి కర్పించి ప్రసాదంబు గొందు
మే మని చెప్పుదు మీతపశ్చరణ ?
తనువును మనమును ధనమును విడిచి
మనికులై రసికులై మగ్ను లై గోష్ఠి
తవులంబు గలిగినతజ్జంగమాను
భవమందు నెప్పుడుఁ బాయకుండుదుము.