పుట:Dvipada-basavapuraanamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

85

సెనసి కప్పినమాడ్కిఁ జీకటుల్ పర్వె.
వరముక్తిసతి బసవనికి నారతులు
పరువడినెత్తు దీపంబులో యనఁగ
నక్షత్రచయ మంతరిక్షంబు నిండి
యక్షీణతరకాంతి యసలార వెలిఁగెఁ;
జంద్రునిచేటు దై త్యేంద్రునిపాటు
నింద్రునిభంగంబు నెఱిఁగి యెఱింగి
గొఱియ మ్రుచ్చిలి శూద్రకుండను రాజు
నఱకు వడుట తొల్లి యెఱిఁగి యెఱింగి 200
జారులఁ జోరులఁ జర్చించుకవుల
భూరివివేకంబుఁ బొగడంగ నేల ?
యనఁగ సంధ్యావేళయందు సద్భక్త
జనులు లింగార్చనల్ సలుపంగ నంత
మిండజంగమకోటి నిండారుభక్తి
దండనాయకుఁ డంపఁ దండతండములు
ఘనసారతాంబూలగంధప్రసూన
వినుతాభరణవస్త్ర వితతులు గొనుచుఁ
గరమర్థి లంజెఱికంబు సేయంగ
నరిగెద మే మంచు ననురక్తి నరుగ- 210

—: ముగ్ధ సంగయ్య కథ :—


లింగసర్వేంద్రియలీనుండు ముగ్ధ
సంగయ్య నా నొక్కశరణుఁ డీక్షించి
భక్తి ననుచువాఁడు బసవబండారి
వ్యక్త మిట్లేఁగెడు వా ర్జంగమములు
కొనిపోవునవి గంధకుసుమకర్పూర
వినుత తాంబూలాదివితతు ; లట్లయ్యుఁ
జను నిది లింగావసరవేళయున్న
పనులకు నేఁగెడు పగిది గా" దనుచు
నదియును నొక్కలింగార్చన గాఁగ