పుట:Dvipada-basavapuraanamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

బసవపురాణము

జాటించి సకలార్ధ సంపదల్ సంద్ర
జూటుభక్తుల కిలు చూఱవెట్టండె ?
తనయపెండిలిసేయుత [1]త్ప్రస్తవమునఁ
జనుదెంచి యొక తపోఁధనుఁడు వేఁడినను
నక్కాంత వెండ్రుక లప్పుడ కోసి
చక్కన మానకంజారుఁ డీఁడెట్టు ? 170
లనుచు గీటునఁబుచ్చుచును మిండగీఁడు
కినియునో తడ వైనఁ దనవేశ్య యనుచు
బసవని వారించి వసుధఁ బ్రోవైనఁ
బసిఁడిచెఱంగుల పటువస్త్రములు
మోపిడి తనమోవనోపి నన్నియును
నేపారఁ గొనివచ్చి యిచ్చె లంజియకు .
“నిక్కంబు బిసవని నిజభక్తి మహిమఁ
దక్కువ గాదయ్యెఁ దరుణిమానంబు"
అని భక్త మండలి వినుతింపుచుండ
వనిత యంతర్వాసమున కేఁగె నంత. 180

—: సూర్యాస్తమయ వర్ణనము :—


బసవనీభక్తి ప్రభాపటలంబు
దెసల వసుంధర దివి దీటుకొనఁగ
దినకరుఁ డాత్మీయతేజంబు దఱుఁగు
డును మది లజ్జించి చని యపరాబ్ధిఁ
బడియెనో యన్నట్లు భానుండు గ్రుంకెఁ ;
జెడి మిత్రుఁ డరుగ రాజీవముల్ మొగిచె ;
భేరులు శంఖముల్ భోరనఁ జెలఁగె;
మారసంహారు నాగారాంతరముల
నలరుచుఁ బంచమహాశబ్దరావ
ములు మ్రోసె ; భక్తసమూహాలయముల 190
ఘనధూపధూమసంజనితమేఘములు

  1. సందర్భమున.