పుట:Dvipada-basavapuraanamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

బసవపురాణము

—: నక్కలు గుఱ్ఱము లైన కథ :—


'మధుర పాండ్యుఁడు దనమంత్రిచే నిట్టు
లధికమర్థం బిచ్చి హయముల విలువఁ
బనుచుడు నతఁడు సద్భక్తి పెక్కువను
జని చని జంగమార్చన సేయఁజేయ
నర్థమంతయుఁ బోవ హయముల విలువ
నర్థంబు లేకున్న ననుమాన ముడిగి 60
పొలమునక్కలనెల్లఁ బిలిచి తెప్పించి
నలిఁ జాండ్యభూనాథునకుఁ బొడసూపఁ
జొక్క నైనారుల మిక్కిలికరుణ
నక్కజం బంద నానక్కలన్నియును
నిలఁ గంకణములతేజులు నయ్యెఁ గాదె ?
మలహరుభక్తులమహిమ దలంప
నిది సోద్య మే” యంచు నెల్లభక్తులును
సదమలచిత్తు లై సంతసంబంద
నతివిస్మయాక్రాంతుఁ డై బిజ్జలుండు
"ఇతఁ డీశ్వరుఁడకాక యితరుండె?" యనుచు 70
వరవస్త్రభూషణావళి సమర్పించి,
పరమానురాగుఁ డై నరులెల్ల వినఁగ
“బందారిమీఁద నెవ్వండేని యింకఁ
గొండెంబు సెప్పునాకుక్కలఁ జెండి
నాలుక ల్గోసి సున్నము సాలఁ బూసి
పోల వేఁచినయిస్ము వోయింతు నోళ్ల "
ననుచు నబ్బసవసింహము వీడుకొల్పఁ
జనుదెంచె నగరికి జనులు నుతింప.

—: బసవఁడు తన భార్యచీర విప్పించి యొక జంగమున కిచ్చిన కథ :—


వెండియు నొక్కయ్య వేశ్యాలయమున
నుండి బానిసఁ బిల్చి “బండారినగర 80