పుట:Dvipada-basavapuraanamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

79

మాయర్థ మొప్పించి నీయంత నుండు"
మనవుడుఁ గించిత్ప్రహసితాస్యుఁ డగుచు
జననాథునకు బసవనమంత్రి యనియెఁ:
"బరమేశుభక్తి యన్‌సురతరు వుండ
హరుభక్తి యన్ కనకాచలం బుండఁ 30
గామారిభక్తిచింతామణి యుండ
సోమార్ధధరుభక్తిసురధేను వుండ
బగుతుఁ డాసించునే పరధనంబునకు?
మృగపతి యెద్దెస మేయునే పుల్లు ?
క్షీరాబ్ధిలోపలఁ గ్రీడించుహంస
గోరునే పడియలనీరు ద్రావంగఁ ?
జూతఫలంబులు సుంబించుచిలుక
బ్రాంతి బూరుగుమ్రానిపండ్లు గన్గొనునె ?
రాకామలజ్యోత్స్నఁ ద్రావుచకోర
మాకాంక్ష సేయునే చీఁకటిఁ ద్రావ ? 40
విరిదమ్మివాసన విహరించుతేఁటి
పరిగొని సుడియునే బబ్బిలివిరుల ?
నెఱుఁగునే యలదిగ్గజేంద్రంబుకొదమ
యెఱపంది చను సీక , నెఱుఁగవుగాక
యరుదగు లింగసదర్దులయిండ్ల
పరవుడ నా కొకసరకె యర్థంబు ?
పుడమీశ ! మీధనంబునకుఁ జే సాఁప;
నొడయల కిచ్చితి నొడయలధనము ;
పాదిగ దఱిఁగిన భక్తుండఁ గాను;
గాదేని ముడుపు లెక్కలు సూడు." మనుచు 50
దట్టుఁడు బసవనదండనాయకుఁడు
పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ
నచ్చెరు వై లెక్క కగ్గలం బున్న