పుట:Dvipada-basavapuraanamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

శ్రీరుద్రభక్తాంఘ్రిశేఖర ! శుద్ధ
వీరమాహేశ్వరాచార : సంగాఖ్య :
దండి యై మఱియొక్క మిండజంగమము
వెండియు బసవనదండ నాయకుఁడు
మంత్రులుఁ దానును మహిపతి వనుపఁ
దంత్రంబునకు జీవితము వెట్టునెడను
“వచ్చి యీయర్థంబు వలయు నింతయును
నిచ్చినఁగాని యొం డే నొల్ల" ననుచు
ధట్టించి యడుగుడుఁ బెట్టెలమాడ
ల ట్టున్నభంగి సోయయ్యకు నొసఁగఁ, 10
దంత్రసమేతు లై ధరణీశుకడకు
మంత్రివర్గం బేఁగి మఱి యిట్టు లనిరి :
"చెప్పినఁ గొండె మౌఁ జెప్పకయున్నఁ
దప్పగు నటుగాన చెప్పఁగవలసెఁ ;
బనిసేయ వెఱతుము బసవయ్యతోడ ;
ధనమెల్ల నొక్కమిండని కిచ్చె" ననుచుఁ
గొండెంబు సెప్పినఁ గోపించి రాజు
బండారిబసవనదండనాయకుని
రప్పించి, “మాయర్థ మొప్పించి పొమ్ము
ద ప్పేమి ? సాలుఁ బ్రధానితనంబు ; 20
‘దండింప రా' దనుతలఁపున నిట్లు
బండార మెంతయుఁ బాడు సేసితివి ;
పరధనం బపహరింపనిబాస యండ్రు
పరధనం బెట్లొకో బసవ : కై కొంటి ?
వేయుమాటలు నేల వెఱతుము నీకు