పుట:Dvipada-basavapuraanamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

బసవపురాణము

బొనరంగఁ గాళవ్వబోయిని కొసఁగి
“యవికలాజాండతత్త్వాత్మకుఁ డైన
శివుఁడు గరస్థలాసీనుఁ డై యుండ 810
సర్వగతుండైన శంభుభక్తునకు
సర్వగతత్వంబు సహజంబ కాదె !
సర్వమయుం డైన శర్వుభక్తునకు
సర్వమయత్వంబు సహజంబ కాదె !
దూరేక్షణంబును దూరశ్రవణము
దూరవిజ్ఞానసిద్ధులు మొద ల్గాఁగ
నణిమాదిసిద్ధులు నభవుభక్తునకు
గణుతింప నెంత శ్లాఘ్యంబు దా" ననుచు
సకలమానవులు మస్తకతటన్యస్త
ముకుళితహస్తు లై మ్రొక్కుచు నుండ 820
“నల్ల వో" యనుచు భూవల్లభుఁ డతులి
తోల్లాసచిత్తుఁ డై యెల్లవస్తువులు
దట్టుఁడు బసవనదండనాయకున
కిట్టలంబుగఁ గట్టనిచ్చె సంప్రీతి.
గురుభక్తిశృంగార ! గుణగణాధార !
వలదయాలంకార! సురచిరాకార !
ఖ్యాతగంభీర ! దుష్కర్మవిదూర !
గీతమహోదార ! ధూతసంసార :
అకుటిలచిత్త ! శివాచారవేత్త :
ప్రకటత త్త్వాయత్త ! ప్రవిమలవృత్త ! 830
అజ్ఞానజైత్ర : యుదాత్తచరిత్ర:
విజ్ఞానపాత్ర : సంవిత్సుఖామాత్ర :
రూఢవ్రతో త్తుంగ ! రుచిరాంతరంగ !
గూఢప్రసాదాంగ ! గొబ్బూరిసంగ :
ఇది యసంఖ్యాతమాహేశ్వర దివ్య
పదపద్మసౌరభ భ్రమరాయమాణ