పుట:Dvipada-basavapuraanamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

75

“బసవ ! మర్త్యమునందు భక్తులు గులరె?
యసకమై సంసార మిష్టమే నీకు ? " 780
నని యానతిచ్చుడు నద్దేవు హృదయ
పవజస్థుఁ డగు బసవం డిట్టు లనియె:
“మందునకై నను మర్త్యలోకమున
నిందుశేఖరుభక్తుఁ డెందును లేఁడు;
భక్తుండ నేన చూ భక్తు లిందఱును
భక్తాత్మ : మీస్వరూపంబ కావునను
వెండియుఁ గల దొక్కవిన్నపం బింకఁ
జండేశవరద : ప్రసన్నత వినుము,
జంగమలింగ ప్రసాదోపభోగ
సంగతసుఖసుధాశరధి నోలాడు 790
నిటువంటిభవము లెన్నేనియు లెస్స
యిట యపవర్గ మహిష్ఠతకంటెఁ ;
గావున శునంసూకరకృథుకీట
కావహజన్మంబు లైనఁ గానిమ్ము
సుప్రసిద్ధము జంగమప్రసాదంబ
యేప్రొద్దు భోగింప నెట్లు గల్గినను
జాలుఁబో భవకోటిశతసంఖ్యలందు
నోలి నన్ బుట్టింపు మొకటియు నొల్ల ."
ననవుడు గౌరీశుఁ డతిదయాదృష్టిఁ
గనుఁగొని సిద్ధరామునకుఁ జూపుడును 800
శివునకు మ్రొక్కుచు సిద్ధరామయ్య
భువికి నేతెంచి యద్భుతము నెక్కొనఁగ
భక సమూహికి బసవయ్యమహిమ
వ్యక్తిగాఁజెప్పంగ నట్ల నే వింటి ;"
ననవుడు బిజ్జలుఁ “డట్టు లౌటకును
జనులకునెల్ల దృష్టం బిప్పు డిదియ"
యనుచు నమూల్యవస్త్రాభరణములఁ