పుట:Dvipada-basavapuraanamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

73

నుమబోటి యత్యద్భుతోపేత గాఁగ
నామూర్తిఁ గని సిద్ధరామయ్య యుద్గ
తామితానందపూర్ణాత్ముఁ డై తనర.
హరుఁడు పర్వతపుత్త్రి నరవిరికంటఁ
బొరిఁ బొరిఁ జూచుచుఁ "బూర్ణేందువదన !

—: శివుఁడు పార్వతికి బసవనిమహిమ తెలుపుట :—


చూచితే బసవనిసురుచిరమహిమ
యీ చెల్వునిల్కడ యేరికిఁ గలదె?
వెలయఁగ నయ్యాదివృషభేంద్రుఁ డనఁగ
నలి నేన రెండుమూర్తులు ధరించితిని ; 730
విను "తవపుత్త్రో భవిష్యామి" యనుచు
నెనయ శిలాదున కేన పుట్టితిని ;
అసలార భక్తహితార్థమై యేన
వసుధ జనించితి బసవం డనంగ;
నెసఁగ నిట్టిదకాన యీశుండ నేన
బసవఁ డన్ పేరి సద్భక్తుండ నేన ;
మున్నును మన బసవన్న సద్గుణ మ
హోన్నతి యెఱుఁగవే యొగి నట్లుఁగాక
లోకాధిపతి నేను లోలాయతాక్షి !
ప్రాకటంబుగ లోకపావనుఁ డితఁడు ; 740
కారణలోకసంహారుండ నేను
కారణలోకోపకారి యితండు :
భక్తవత్సలుఁడ నేఁ బర్వతపుత్త్రి :
భక్తరత్నములకు బండారి యితఁడు ;
భక్తైకదేహుండ భావింప నేను ;
భక్తజనప్రాణి బసవఁ డీక్షింప ;
ముక్తికి రాజఁజూ ముద్దియ నేను,
భక్తికి రాజుసూ బసవఁ డీక్షింపఁ :
బసరింప నే లింగపట్టబద్ధుండ,