పుట:Dvipada-basavapuraanamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

బసవపురాణము

నరిగి కైలాసనగాగ్రహర్మ్యమున *
నంబికాసహితుఁడై యాస్థానమంట
పంబునఁ బేరోలగంబున నున్న
శివదేవుఁ గనుఁగొని సిద్ధరామయ్య
యవిరళభక్తిసాష్టాంగుఁడై మ్రొక్కి,
“విన్నపం బవధారు విశ్వలోకైక
సన్నుత ! " మర్త్యంబు సద్భక్తజనులు 700
“ప్రథలోకంబువ బసవండు గలఁడొ
ప్రమథేశుకొలువునఁ బరికింపు" మనిరి ;
“బసవసంస్రుత్య : సద్భక్తైకదేహ !
యసలార నున్నరూ పానతి" మ్మనిన

—: శివుఁడు తనహృదయమున బసవనిఁ జూపుట :—


నాలోక మీలోక మననేల బసవఁ
డేలోకమునను లే ! డెల్ల చో నుండుఁ
బ్రమథులయందు సద్భకులయందు
నమరంగ నాహృదయాబ్జకర్ణికను
సతతంబు గురులింగచరములయందు
నతిముదమున నుండు నాదిబసవఁడు 710
అట్టౌట కిటు సూడుమా” యని శంభుఁ
డిట్టలంబుగఁ దనహృదయంబుఁ దెఱవ
సంగతం బగు కరస్థలము లింగంబు
జంగమావళికిని శర ణనుకరము
ననిమిషుఁడై చూచు హరుమీఁదిదృష్టి
గనుఁగవహర్షా శ్రుకణవితానంబు
దరహసితాస్యవిస్ఫురణయుఁ దనరఁ
బరమశివధ్యానపారవశ్యమునఁ
బద్మాసనస్థుఁ డై పరమేశుహృదయ
పద్మంబునం దున్న బసవనిఁ జూచి. 720
ప్రమథులు హర్షింప నమరులు మ్రొక్క