పుట:Dvipada-basavapuraanamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

71

బోయినచోటఁ దత్పురి సుఖగోష్ఠి
నాయతభక్త సభాభ్యంతరమున
సిద్ధరామునిఁ జూచి శివభక్తనితతి
‘‘సిద్ధుండ ! లోకప్రసిద్ధంబు గాఁగ
నభినవ శ్రీగిరి యనఁగ నిప్పురము
నభినవలీల సొంపార రచించి 670
యాపర్వతము మల్లికార్జునదేపు
నేపారఁ గొనివచ్చి యిచ్చట నిలిపి ;
ధ్రువముగా లక్షయుఁ దొంబదివేలు
శివలింగములను జెచ్చెరఁ బ్రతిష్ఠించి,
దానికి , దగఁగ మర్త్యములోనియన్న
పానముల్ ముట్టక భక్తిపెంపునను
సహజమకుటము నొసలికన్నుఁదనర
మహితయోగానందమహనీయలీల
మేనినీడయు భువి మెట్టినయజ్జ
గానఁగఁబడ దనఁగాఁ జరిపించును 680
నమితసమాధియోగాంతంబునందుఁ
బ్రమథలోకమునకుఁ బన్నుగా నేఁగి
యక్కడఁ దత్త్వరహస్యసద్గోష్ఠి
మక్కువ నెక్కొన మసలి యేతెంతు ;
ప్రఖ్యాత మిది మాకుఁ బ్రమథలోకమున
నాఖ్యాతసత్కీర్తి యగుబసవాఖ్యుఁ
బొడగంటిరే భక్తభూరిసద్గోష్ఠిఁ
గడు నొప్ప నిక్కడఁ గలుగు నక్కడను
నతఁ డుండు నా విందు మఖిలలోకముల
సతతసాన్యిధ్యానుషక్తిమై" ననిన 690
శివభక్తతతిఁ జూచి సిద్ధరామయ్య
"ప్రవిమలగతి నేఁడు ప్రమథలోకమున
నరసి వచ్చెద" నంచు నాక్షణంబునను